TCS Q4 Results Highlights: గత త్రైమాసికంలో 1,03,546ల నియామకాలు చేపట్టిన ఐటీ దిగ్గజ కంపెనీ! లాభాల బాటలో..
దేశంలో అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్‌గా పేరుగాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఏడాది (2022) మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది..
TCS Adds Over 35,000 Employees In Q4: దేశంలో అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్‌గా పేరుగాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఏడాది (2022) మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. నాల్గవ త్రైమాసికం (ఏప్రిల్)లో నికర ప్రాతిపదికన ఏకంగా 35,209 మంది ఉద్యోగులకు అవకాశం కల్పించింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,92,195కు చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి గరిష్ఠ స్థాయిలో 1,03,546 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు సోమవారం (ఏప్రిల్ 11) తెల్పింది. ఇది ఆల్ టైమ్ రికార్డని పేర్కొ్ంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో 153 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారని, మొత్తం 5.6 శాతం మంది మహిళలున్నట్లు కంపెనీ తెలిపింది.
అంతేకాకుండా ఐటీ రంగంలో అట్రిషన్ (వలసలు) ఈ త్రైమాసికంలో 17.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల శాతం (IT services attrition rate) వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఇంక్రిమెంటల్ ఆట్రిషన్ మోడరేట్ చేసినట్లు తెల్పింది. ఇక మార్చి 2022 ముగింపునాటికి రూ.50,591 కోట్ల లాభంతో 16% వృద్ధిబాటలో దూసుకుపోతోంది. గత ఏడాది Q4 ఏకీకృత నికర లాభం రూ.9,246 కోట్లు ఉంటే, ఈ ఏడాదికి 7శాతం పెరిగి రూ.9,926 కోట్లకు చేరుకుందని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
Also Read: