Telugu News » Photo gallery » If you follow these 6 steps at least once a week then you get smooth hair
Summer Hair Care Tips: వారానికోసారి ఈ విధంగా చేశారంటే పట్టుకుచ్చులా జారీపోయే మెత్తని కురులు మీ సొంతం!
Srilakshmi C |
Updated on: Apr 11, 2022 | 7:13 PM
మెత్తని, మృదువైన జుట్టును ఎవరు ఇష్టపడరు! ఐతే అందుకు కనీసం వారానికి ఒకసారైనా ఈ కింది 6 స్టెప్పులను పాటించారంటే మీ కేశాలు మీమాట వింటాయి. .
Apr 11, 2022 | 7:13 PM
Hair Care
1 / 6
అందుకు క్రమం తప్పకుండా జుట్టుకు నూనెతో మసాజ్ చేయాలి. మూలికా నూనె ఐతే బెటర్! కరివేపాకు నూనె లేదా బాదం అధికంగా ఉండే నూనెను జుట్టుకు ఉపయోగించవచ్చు. నూనెను కొద్దిగా వేడి చేసి మసాజ్ చేస్తే సౌకర్యవంతంగా ఉండటమేకాకుండా, జుట్టుకు పోషణను అందిస్తుంది.
2 / 6
తర్వాత హెయిర్ మాస్క్ ధరించండి. హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణను అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పొడిబారడం, చిట్లడం, కరుకుబారకుండా చేస్తుంది.
3 / 6
హెయిర్ మాస్క్ ఉపయోగించిన ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటిలో షాంపుతో స్నానం చేయాలి.
4 / 6
షాంఫు చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించండి. జుట్టులో తేమను నిలుపుకోవడంలో కండీషనర్ సహాయపడుతుంది. షాంపూ ఉపయోగించిన తర్వాత, జుట్టుకు కండీషనర్ అప్లై చేసి 20 నిమిషాలు తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.