AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Green: దూసుకెళ్తున్న అదానీ గ్రీన్‌ షేరు.. ఒక్కరోజే 20 శాతం పెరుగుదల..

ఈ ఏడాది అదానీ గ్రూప్‌ కంపెనీల పనితీరు అద్భుతంగా ఉంది. ఈ గ్రూప్‌కు చెందిన ఏడు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టయి ఉన్నాయి...

Adani Green: దూసుకెళ్తున్న అదానీ గ్రీన్‌ షేరు.. ఒక్కరోజే 20 శాతం పెరుగుదల..
Adani
Srinivas Chekkilla
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Apr 12, 2022 | 6:15 AM

Share

ఈ ఏడాది అదానీ గ్రూప్‌ కంపెనీల పనితీరు అద్భుతంగా ఉంది. ఈ గ్రూప్‌కు చెందిన ఏడు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టయి ఉన్నాయి. ఈ ఏడు కంపెనీలు గత మూడు నెలల్లో పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. ఈరోజు అదానీ గ్రీన్(Adani Green) షేర్ దాదాపు 15 శాతం లాభంతో రూ.2665 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఇది 20 శాతం పెరిగి రూ.2786 స్థాయికి చేరుకుంది, ఇది 52 వారాలకు కొత్త రికార్డు. ఈరోజు అదానీ గ్రీన్ మరో కొత్త రికార్డు సృష్టించింది. అదానీ గ్రీన్ భారతదేశంలోని టాప్-10 కంపెనీలలో చేరింది. మార్కెట్ క్యాప్ పరంగా ఈ కంపెనీ ఎయిర్‌టెల్(Airtel) మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. NSEలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. నేటి ర్యాలీ తర్వాత, అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.4.35 లక్షల కోట్లకు పెరిగింది. ఈరోజు ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.4.16 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఈ విధంగా దేశంలో 10వ అతిపెద్ద కంపెనీగా అవతరించింది.

మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే నంబర్ వన్ కంపెనీ. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఉండగా అదానీ గ్రీన్ ఇప్పుడు పదో స్థానానికి చేరుకుంది. ఈ స్టాక్ గత వారంలో 26 శాతం ఒక నెలలో 43 శాతం, మూడు నెలల్లో 70 శాతం, ఈ ఏడాది ఇప్పటివరకు 100 శాతం రాబడులను ఇచ్చింది. వాస్తవానికి అబుదాబికి చెందిన పెట్టుబడి సంస్థ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ అదానీ గ్రూప్‌లోని మూడు కంపెనీలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అంటే 15 వేల కోట్ల రూపాయల నిధిని డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించింది. అదానీ గ్రూప్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి.

ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో రూ.3850 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లో రూ.3850 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మిగిలిన రూ.7700 కోట్లను అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ మాట్లాడుతూ, అదానీ గ్రూప్, ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ స్థిరమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉన్నాయని చెప్పారు.

Note: ఇది కేవలం NSE డేటా ప్రకారం ఇచ్చింది మాత్రమే. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నాయి. ఇందులో పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించడం మంచిది.

Read Also.. Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 2.65 శాతం పడిపోయిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్..