HQ South Western Command Jobs 2022: పది/ఇంటర్ అర్హతతో.. ఆర్మీ సౌత్ వెస్టర్న్ కమాండ్‌లో గ్రూప్ ‘సీ’ సివిలియన్ పోస్టులు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సౌత్ వెస్టర్న్ కమాండ్ (Army South Western Command) ప్రధాన కార్యాలయం.. గ్రూప్ సీ సివిలియన్ (Group C Civilian Posts) పోస్టుల భర్తీకి..
Army HQ South Western Command Group C Civilian Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సౌత్ వెస్టర్న్ కమాండ్ (Army South Western Command) ప్రధాన కార్యాలయం.. గ్రూప్ సీ సివిలియన్ (Group C Civilian Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
విభాగాలు: చౌకీదార్, కుక్, ఎల్‌డీసీ, సఫాయివాలా, ట్రేడ్స్‌మెన్, మేట్, వాషర్‌మెన్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: మెడికల్ బ్రాంచ్, సౌత్ వెస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్, జయపుర, రాజస్థాన్ 302012.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: