Sainik School Nalanda Jobs 2022: పది/ఇంటర్ అర్హతతో నలంద సైనిక్ స్కూల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.50000 జీతంతో..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన నలందలోని సైనిక్ స్కూల్ (Nalanda Sainik School).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
Sainik School Nalanda Art Master Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన నలందలోని సైనిక్ స్కూల్ (Nalanda Sainik School).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 14
పోస్టుల వివరాలు:
- ఆర్ట్ మాస్టర్ పోస్టులు: 1
- బ్యాండ్ మాస్టర్ పోస్టులు: 1
- కౌన్సెలర్: 1
- నర్సింగ్ సిస్టర్ పోస్టులు: 1
- పీఈఎం/పీటీఐ/మాట్రన్ పోస్టులు: 1
- జనరల్ ఎంప్లాయిస్: 2
- జనరల్ ఎంప్లాయిస్: 7
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ నలంద, బీహార్ 803115.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: