NTRO Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో 206 ఐటీ ప్రొఫెషనల్స్‌ కొలువులు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (NTRO).. ఒప్పంద ప్రాతిపదికన సైబర్‌ సెక్యురిటీ అనలిస్ట్‌ (Cyber Security Analyst Posts) పోస్టుల భర్తీకి..

NTRO Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో 206 ఐటీ ప్రొఫెషనల్స్‌ కొలువులు..
Ntro
Follow us

|

Updated on: Apr 11, 2022 | 4:19 PM

NTRO Consultant Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (NTRO).. ఒప్పంద ప్రాతిపదికన సైబర్‌ సెక్యురిటీ అనలిస్ట్‌ (Cyber Security Analyst Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 206

పోస్టుల వివరాలు: సైబర్‌ సెక్యురిటీ అనలిస్ట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌, రిస్క్‌ అనలిస్ట్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, టీమ్‌ లీడర్, హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌, సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ తదితర పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: క్వాలిటీ అండ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌ మెథడ్‌ (QCBS) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 22, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Exim Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..