ESIC Recruitment: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ న్యూఢిల్లీలోని కార్యాలయంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 84 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ రెసిడెంట్లు (48), జీడీఎంఓ (36) ఖాళీలు ఉన్నాయి.
* పాథాలజ, సర్జికల్ ఆంకాలజీ, రేడియాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, కాజువాలిటీ, ఈఎన్‌టీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
* సంబంధిత ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్లతో పాటు.. డీన్ కార్యాలయం, ఈఎస్‌ఐ-పీజీఐఎంఎస్‌ఆర్, బసైదరాపూర్, న్యూదిల్లీ అడ్రస్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
* వాక్ ఇన్ ఇంటర్వ్యూలను జులై 05, 06 తేదీల్లో నిర్వహించనున్నారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..