ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వయసుతో పని లేదు. ఏ వయసు వారైనా ఇంగ్లీష్‌ను నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనుకునే వారు ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. అయితే, ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో చాలా మంది ఆంగ్ల పదాల ఉచ్చారణలో సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సందర్భంలో భాషపై అవగాహన పెంచుకోవడానికి, తప్పులను సరి చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీు కూడా మీ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ఇందుకోసం పెద్ద పెద్ద నిఘంటువులతో గంటల తరబడి కుస్తీ పడుతున్నారా? అదంతా ఏమీ అవసరం లేదు. జస్ట్ సింపుల్‌గా మూడు చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి వక్తగా ఉండాలంటే మంచి శ్రోతగా ఉండాలని అంటారు. అదేవిధంగా.. మాటలు బాగా మాట్లాడాలంటే బాగా చదవడం తెలుసుకోవాలి. పదజాలం పెంచుకోవడానికి పుస్తకాలు చదవడం చాలా ఉపయోగపడుతుంది. పుస్తకాలలో అనేక రకాల కొత్త పదాలను చూడవచ్చు. అంతే కాకుండా రోజూ ఇంగ్లీషు న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అందులో వచ్చే కొత్త పదాలను నేర్చుకోవాలి. ఇలా నిత్యం చదవడం వల్ల ఇంగ్లీష్ పదజాలం పెరగడమే కాకుండా సరైన రీతిలో మాట్లాడటానికి ఉపకరిస్తుంది.
కొత్త పదాలను నేర్చుకున్న తర్వాత పదజాలాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ మార్గం.. ఆ పదాలను రాయడం. కొత్తగా నేర్చుకున్న పదాలను వ్రాయడం ద్వారా వాటిని గుర్తుంచుకోవచ్చు. నేర్చుకున్న పదాలను ఉపయోగించడం ద్వారా వాటిపై మంచి అవగాహన పొందవచ్చు.
ఆంగ్ల పదజాలాన్ని మెరుగుపరచడానికి, వ్యక్తులు మరొక వ్యక్తితో సంభాషించాలి. అవతలి వ్యక్తి నుండి కొత్త పదాలను నేర్చుకోవచ్చు. సంభాషణలో పాల్గొనడం వలన సరైన ఉచ్చారణ, పద ధ్వనిని బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. వీలైనంత వరకు ఇంగ్లీష్‌లోనే మాట్లాడటానికి ప్రయత్నించాలి. కొన్ని ఆన్‌లైన్ వీడియోలను చూడవచ్చు. వాటి నుండి కూడా నేర్చుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న ఇంగ్లీష్ మాట్లాడే వారితో చాట్ కూడా చేయొచ్చు.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..