EDCIL Recruitment: ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EDCIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ మినీరత్నసంస్థ పదో తరగతి విద్యార్హత మొదలు పీహెచ్‌డీ ఆధారంగా ఉన్న పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ కన్సల్టెంట్లు (ఫైనాన్స్) – 02, కన్సల్టెంట్లు (10), ఐటీ మేనేజర్ (01), ఐటీ ఎగ్జిక్యూటివ్ (01), ఆఫీస్ మేనేజర్ (01), ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (03), ఆఫీస్ బాయ్స్ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ అడ్వాన్సడ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు తప్పనిసరి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25000 నుంచి రూ. 75000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 07-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Hyderabad: విడాకుల కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసిన లాయర్.. వీడియోలు తీసి.. శారీరకంగా
Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 10 ఆహారాలను మీ డైట్‌లో చేర్చాల్సిందే..!