DDA Recruitment 2022: డీడీఏలో కన్సల్టెంట్ ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే.. వివరాలు ఇవిగో!

ఢిల్లీ డెవలప్‌మెంట్ అధారిటీ (Delhi Development Authority) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది.

DDA Recruitment 2022: డీడీఏలో కన్సల్టెంట్ ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే.. వివరాలు ఇవిగో!
Delhi Development Authority
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 22, 2022 | 2:02 PM

Delhi Development Authority Consultant Jobs 2022: ఢిల్లీ డెవలప్‌మెంట్ అధారిటీ (Delhi Development Authority) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు.. * నోటిఫికేష‌న్‌లో భాగంగా సీనియర్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ (2), జూనియర్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌ (3)లకు సంబంధించి మొత్తం 5 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు లాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఆర్కిటెక్చర్‌‌ విభాగంలో ఐదేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, ఒక సంవత్సరం అనుభవం కూడా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు.. * ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులను అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధులు ఫిబ్ర‌వ‌రి 9, 2022లోపు consultant.rc@dda.org.inకి మెయిల్ పంపించాలి.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 45,000 నుంచి రూ. 65,000ల వరకు జీతం చెల్లిస్తారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read:

ICMR NIE Project Staff Jobs: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ. 35,000లకు పైగా జీతం