ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని సంస్థలో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–145, డిప్లొమా అప్రెంటిస్‌లు–05 ఖాళీలు ఉన్నాయి.
* ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 31-01-2022 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి 18-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
TS – AP: విభజన అంశాలపై ముందడుగు.. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్ర హోం శాఖ..