తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 190 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈఎస్ఈ/ఐటీ/ఈసీఈ/ఈఈఈ/ఈఅండ్‌ఐ/ఈటీసీ/ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన ఇంజనీరింగ్ కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత డాక్యుమెంట్లతో నవంబర్ 26,28,29 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికై వారు హైదరాబాద్, బెంగళూరు, ముంబాయి, రావత్‌భట, కోట, నలియా, అల్హాబాద్, లక్నో, వైజాగ్, యాదాద్రిలో పనిచేయవల్సి ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి మొదటి ఏడాది నెలకు రూ.25,000లు, రెండో ఏడాది నెలకు రూ.28,000లు, మూడో, నాలుగో ఏడాది నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: Factory Main Gate, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.