కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు.. 55 మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్ (మెడికల్, పారా మెడికల్ స్టాఫ్) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్/ఎంబీబీఎస్/బీడీఎస్/డిప్లొమా/బీఫార్మసీ/జీఎన్‌ఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 19, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్షలేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలు డిసెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.28,100ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Station Headquarters ECHS Cell, C/O Bison URC Complex, Nag Mandir Road, Tirumalagiri Post, Secunderabad 500015, Telangana.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.