భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఐటీఐ) కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 29, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.