ECL Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఇంటర్ అర్హతతో.. కోల్ ఇండియా లిమిటెడ్‌లో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

|

Feb 05, 2022 | 12:59 PM

కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited)అనుబంధ సంస్థ అయిన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (Eastern Coalfields Limited), మైనింగ్ సిర్దార్‌లోని వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

ECL Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఇంటర్ అర్హతతో.. కోల్ ఇండియా లిమిటెడ్‌లో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Ecl
Follow us on

ECL Recruitment 2022: కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited)అనుబంధ సంస్థ అయిన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (Eastern Coalfields Limited), మైనింగ్ సిర్దార్‌లోని వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 313

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు:

  • జనరల్ కేటగిరీలో: 127
  • ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో: 30 ఖాళీలు
  • ఓబీసీ కేటగిరీలో: 83 ఖాళీలు
  • ఎస్సీ కేటగిరీలో: 46 ఖాళీలు
  • ఎస్టీ కేటగిరీకిలో: 23 ఖాళీలు

పే స్కేల్: ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.31,852 వరకు చెల్లిస్తారు.

అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. డీజీఎమ్‌ఎస్ నుంచి వ్యాలీడ్ సిర్ధార్‌షిప్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 20, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP Jobs 2022: ఇంటర్ అర్హతతో రూ. లక్షకుపైగా జీతంతో ఉద్యోగాలు.. కర్నూలులో ప్రారంభమైన ఇంటర్వ్యూలు.. ఇక 4 రోజులే!