DRDO CEPTAM recruitment: ఇంట‌ర్వూ ఆధారంగా బీఈ/బీటెక్ విద్యార్థుల‌కు డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

May 06, 2021 | 5:56 AM

DRDO CEPTAM recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ సంస్థ డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిపికేష‌న్ ద్వారా డీఆర్‌డీఓలోని...

DRDO CEPTAM recruitment: ఇంట‌ర్వూ ఆధారంగా బీఈ/బీటెక్ విద్యార్థుల‌కు డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Drdo Jobs
Follow us on

DRDO CEPTAM recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ సంస్థ డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిపికేష‌న్ ద్వారా డీఆర్‌డీఓలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్స‌న‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం)లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో (జీఆర్ ఎఫ్‌) పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ నోటిఫికేష‌న్ ద్వారా రెండు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* విద్యార్హ‌త విష‌యానికొస్తే.. అభ్య‌ర్థులు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌–ఆటోమేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌–ఇన్ఫర్మేటిక్స్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌–ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌–ఇంజనీరింగ్, కంప్యూటర్‌–కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* పైన తెలిపిన సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఫ‌స్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణ‌త సాధించాలి. దీంతో పాటు.. నెట్‌/గేట్‌ అర్హత లేదా ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ స్కిల్స్‌ తెలిసి ఉండాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

* అప్లై చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌చేస్తారు.

* ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు వారికి విద్యార్హ‌త మార్కుల షీట్ల‌తో పాటు క్యాస్ట్ స‌ర్టిఫికేట్‌, గేట్‌/నీట్ స్కోర్ ఫైళ్ల‌ను పీడీఎఫ్ విధానంలో recruitment@ceptam.drdo.in ఐడీకీ మెయిల్ చేయాలి.

* మెయిల్ చేయ‌డానికి చివ‌రి తేదీగా 07.05.2021గా నిర్ణ‌యించారు.

* ఎంపికైన అభ్య‌ర్థులు ఢిల్లీలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాల‌కు www.drdo.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

Also Read: AIIMS Recruitment 2021: మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..

JEE Main 2021: కరోనా ఎఫెక్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కేంద్రం ప్రకటన..

కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ ఎన్ని రోజులకు కొవిడ్ సోకుతుంది..! తెలిస్తే షాక్ అవుతారు..?