కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్.. 139 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నస్థీషియా, బయోకెమిస్ట్రీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు మార్చి 13, 2023వ తేదీ నాటికి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో మార్చి 13, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/వికలాంగ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఏప్రిల్ 9న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.67,000ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
Central Diary & Dispatch Section, Near Gate No. 1, ABVIMS & Dr Ram Manohar Lohia Hospital, New DelhF110001.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.