AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Eamcet: తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ శాశ్వతంగా రద్దు..! ఇకపై ర్యాంకు ఆధారంగానే..

తెలంగాణ‌లో ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని విద్యాశాఖ శాశ్వతంగా తొలగించనుంది. దీనిపై సంబంధించిన జీవో త్వరలోనే వెలువడనుంది. 2023-24 విద్యాసంవత్సరానికి ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని..

TS Eamcet: తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ శాశ్వతంగా రద్దు..! ఇకపై ర్యాంకు ఆధారంగానే..
Inter Weightage
Srilakshmi C
|

Updated on: Feb 27, 2023 | 1:45 PM

Share

తెలంగాణ‌లో ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని విద్యాశాఖ శాశ్వతంగా తొలగించనుంది. దీనిపై సంబంధించిన జీవో త్వరలోనే వెలువడనుంది. 2023-24 విద్యాసంవత్సరానికి ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఎంసెట్‌ వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును నిర్ణయించడం జరుగుతోంది. ఎంసెట్‌ పరీక్షలో సబ్జెక్టులైన గణితం, ఆ తర్వాత ఫిజిక్స్, చివరగా కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. గత కొన్నేళ్లుగా మార్కులు కాకుండా పర్సంటైల్‌ను లెక్కిస్తున్నారు. పర్సంటైల్‌ కూడా ఒకటే వస్తే పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకొని ఎవరు పెద్దవారైతే వారికి మెరుగైన ర్యాంకును కేటాయిస్తారు. కరోనా కారణంగా 2020, 2021, 2022 ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ తొలగించారు. ఈ ఏడాదితో కూడా కలిపి వరుసగా నాలుగేళ్లుగా ఇంటర్‌ వెయిటేజీ లేకుండానే ఎంసెట్‌ ప్రవేశాలు కల్పిస్తున్నారు. దీంతో ఎంసెట్‌-2023 నుంచి ఇంటర్‌ మార్కులను వెయిటేజీ శాశ్వతంగా రద్దు చేయనున్నారు. ఇంటర్‌ విద్యార్ధులు బట్టీపట్టి 900లకుపైగా మార్కులు పొందుతున్నారు. అదే ఎంసెట్‌లో కనీస మార్కులు కూడా పొందలేకపోతున్నారు. సబ్జెక్ట్ పరిజ్ఞానం లేనివారిని ఫిల్టర్ చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలకు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించారు.

ఉదాహరణకు ఎంసెట్‌లో 160కి 80 మార్కులు వస్తే 75 శాతం లెక్కన 37.5 మార్కులు వచ్చినట్లుగా పరిగణిస్తారు. (80/160 × 75 = 37.5) ఇంటర్‌లో 600 మార్కులకు 576 సాధిస్తే 25 శాతానికి కుదించినప్పుడు 24 మార్కులు వచ్చినట్లు లెక్క. (576/600 × 25 = 24)

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..