తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సూచన.. సెప్టెంబరు 1న ఏపీ పాలిసెట్‌.. దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు..

|

Aug 12, 2021 | 10:12 PM

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువును దోస్త్ మరోసారి పొడిగించింది. ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గుడువును..

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సూచన.. సెప్టెంబరు 1న ఏపీ పాలిసెట్‌..  దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు..
Polytechnic Joint Entrance
Follow us on

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువును దోస్త్ మరోసారి పొడిగించింది. ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గుడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ప్రకటించారు. తొలి విడతలో సీటు పొందిన వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని పేర్కొన్నారు. ఇవాళ్టి వరకు 1,27,160 మంది సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసినట్లు లింబాద్రి వెల్లడించారు. ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ గడువు నేటితో ముగిసినప్పటికీ.. విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి మేరకు మరో నాలుగు రోజులు పొడిగిచినట్లు లింబాద్రి తెలిపారు. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సీటు రిజర్వ్ అవుతుందని.. అవసరమైతే మెరుగైన సీటు కోసం రెండో విడతలో ప్రయత్నించవచ్చునన్నారు. రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 18తో ముగియనుంది. రెండో విడతలో 18,256 మంది విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 35,583 మంది వెబ్ ఆప్షన్లు సమర్పించినట్లు లింబాద్రి వెల్లడించారు.

ఏపీలో సెప్టెంబరు 1న పాలిసెట్‌

ఇక ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబరు 1వ తేదీన పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18 వరకు గడువు విధించింది.

ఇవి కూడా చదవండి:  Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు..  

Credit Card Payment: మీరు క్రెడిట్ కార్డు బిల్ పే చేసేముందు ఇలా చేస్తే బోలెడు డబ్బులు కలిసి వస్తాయి..