DMHO Srikakulam Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. శ్రీకాకుళం జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలోని శ్రీకాకుళం జిల్లాలో ఎయిడ్స్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం కింద (DMHO Srikakulam).. ఒప్పంద ప్రాతిపదికన 25 ఐసీటీసీ కౌన్సెలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్, తదితర..

DMHO Srikakulam Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. శ్రీకాకుళం జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..
Apsacs

Updated on: Aug 17, 2022 | 4:36 PM

DMHO Srikakulam ICTC Counselor Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలోని శ్రీకాకుళం జిల్లాలో ఎయిడ్స్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం కింద (DMHO Srikakulam).. ఒప్పంద ప్రాతిపదికన 25 ఐసీటీసీ కౌన్సెలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్, ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి/ఎంబీబీఎస్‌/సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా/డీఎంఎల్‌టీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆగస్టు 25, 2022వ తేదిలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులను పంపాలి. జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అభ్యర్ధులను అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

  • ఐసీటీసీ కౌన్సెలర్ పోస్టులు: 2
  • ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 6
  • ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 2
  • ఏఆర్‌టీ స్టాఫ్ నర్స్ పోస్టులు: 3
  • ఏఆర్‌టీ కౌన్సెలర్ పోస్టులు: 1
  • ఏఆర్‌టీ ఫార్మాసిస్ట్ పోస్టులు: 1
  • ఎల్‌ఏసీ, స్టాఫ్ నర్స్ పోస్టులు: 2
  • బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 3
  • బ్లడ్ బ్యాంక్ కౌన్సెలర్ పోస్టులు: 1
  • బ్లడ్‌ స్టోరేజ్‌ ఎల్‌టీ పోస్టులు: 2
  • బ్లడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్ డ్రైవర్ పోస్టులు: 1
  • బ్లడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్ అటెండెంట్ పోస్టులు: 1

అడ్రస్: DISTRICTAIDS PREVETION & CONTROL UNIT, 2nd floor, DM&HO Office, Srikakulam. AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇది కూడా చదవండి..టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..