ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోనున్న వైఎస్సార్ అర్బన్ క్లినిక్/ యూపీహెచ్‌సీల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 45 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదోతరగతి, ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఎంఎల్‌టీ), బీఫార్మసీ, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్ 21, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికై వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, ఏలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.