AP ASHA Worker Jobs 2025: పదో తరగతి పాసైన వారికి 1294 ఆశా వర్కర్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆశా (Accredited Social Health Activist) వర్కర్ల నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1294 ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు..

AP ASHA Worker Jobs 2025: పదో తరగతి పాసైన వారికి 1294 ఆశా వర్కర్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ASHA Worker Jobs

Updated on: Jun 26, 2025 | 10:31 AM

ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆశా (Accredited Social Health Activist) వర్కర్ల నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద అన్నమయ్య జిల్లాలో మొత్తం 1294 ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 30వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

ఆశా వర్కర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన నివాసి అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. మెరుగైన సామర్ధ్యాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే అభ్యర్థి సంబంధిత గ్రామంలో నివాసిస్తున్నట్లు గ్రామ నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. స్థానికంగా పని చేయగల సామర్థ్యం కూడా ఉండాలి.

ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్ధులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలు (పాస్‌ఫోటో, స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల పత్రాలు, ఆధార్ కార్డు, తల్లిదండ్రుల వివరాలు) తీసుకుని సంబంధిత మెడికల్ ఆఫీసర్ (PHC)కార్యాలయంకి వెళ్లి జూన్‌ 30, 2025వ తేదీలోపు స్వయంగా సమర్పించవల్సి ఉంటుంది. అయితే ప్రకటనలో ఎంపిక పూర్తి వివరాలు పేర్కొనకపోయినప్పటికీ.. విద్యార్హతలు, స్థానికత ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ఒక్కో గ్రామానికి ఒక ASHA వర్కర్ చొప్పున ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం కాంట్రాక్ట్/హాజరు ప్రాతిపదికన విధుల్లో చేరవచ్చని ప్రకటనలో అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.