Ananthapuramu DMHO PHCs/UPHCs Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (Primary Health Centers and Urban Health Centers) .. ఒప్పంద ప్రాతిపదికన జెరియాట్రిక్, అబ్‌స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్ తదితర పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: స్పెషలిస్టు డాక్టర్ పోస్టులు
ఖాళీల వివరాలు:
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్/ఎండీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Medical and Health Office, Ananthapuramu District, AP.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.