DIC Recruitment: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌ (డీఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీటెక్‌ అర్హతతో పలు పోస్టుల భర్తీ చేయనుంది. డేటా విభాగంలో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు...

DIC Recruitment: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
Dic Recruitment

Updated on: May 22, 2023 | 8:35 PM

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌ (డీఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీటెక్‌ అర్హతతో పలు పోస్టుల భర్తీ చేయనుంది. డేటా విభాగంలో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డేటా అనలిస్ట్‌ పోస్టులు (40), డేటా సైంటిస్ట్‌ పోస్టులు (20) ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది. అవసరానికి అనుగుణంగా దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 03-06-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..