భారత ప్రభుత్వ విభాగానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో 70 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ (గ్రూప్-సీ) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పెంపొందించింది. గతంలో విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 10తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా.. తాజా ప్రకటనతో నవంబర్ 17వ తేదీ రాత్రి 12 గంటల వరకు పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం ఇచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో సైన్స్/కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/ఈఎస్‌ఎమ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష (టైర్-1, టైర్- 2) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.