CSIR-UGC NET Result Date: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) జూన్‌-2024 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది. అక్టోబర్‌ 15వ తేదీన సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు సీఎస్‌ఐఆర్‌కు చెందిన హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ (హెచ్‌ఆర్‌డీజీ) అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా..

CSIR-UGC NET Result Date: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
CSIR-UGC NET Result Date
Follow us

|

Updated on: Oct 08, 2024 | 8:47 AM

అమరావతి, అక్టోబర్‌ 8: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) జూన్‌-2024 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది. అక్టోబర్‌ 15వ తేదీన సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు సీఎస్‌ఐఆర్‌కు చెందిన హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ (హెచ్‌ఆర్‌డీజీ) అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దేశవ్యాప్తంగా 187 నగరాల్లో 348 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 25, 26, 27 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 2,25,335 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం యేటా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహిస్తు్న్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీకి నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధిస్తే యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేసేందుకు అవకాశం ఉంటుంది.

అక్టోబర్‌ 14 నుంచి వ్యవసాయ వర్సిటీలో కౌన్సెలింగ్‌

తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో బైపీసీ విభాగంలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్‌ 14 నుంచి 19వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ (ఆనర్స్), బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ (ఆనర్స్), బీటెక్ పుడ్ టెక్నాలజీ, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ కోర్సుల్లో ఈ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల భర్తీ ఉంటుంది. టీజీ ఈఏపీసెట్‌ 2024లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు రాజేంద్రనగర్‌లోని పీజేటీఎస్‌ఏయూ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆయా తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు షురూ!
హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు షురూ!
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు