CSIR NPL Recruitment 2022: సీఎస్ఐఆర్‌- నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీలో టెక్నీషియన్‌ ఉద్యోగాలు..రూ.33,848ల జీతంతో బంపరాఫర్‌!

|

Jun 05, 2022 | 4:29 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (CSIR - NPL).. టెక్నీషియన్ పోస్టుల (Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

CSIR NPL Recruitment 2022: సీఎస్ఐఆర్‌- నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీలో టెక్నీషియన్‌ ఉద్యోగాలు..రూ.33,848ల జీతంతో బంపరాఫర్‌!
Csir Npl
Follow us on

CSIR – NPL Technician Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ – నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (CSIR – NPL).. టెక్నీషియన్ పోస్టుల (Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 79

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టెక్నీషియన్ పోస్టులు

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌) తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.19,900ల నుంచి రూ.33,848ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐతోపాటు అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ ట్రేడ్‌ టెస్ట్/రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్: కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌, సీఎస్‌ఐఆర్‌ – నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ, కేఎస్‌ క్రిష్ణన్‌ మార్గ్‌, న్యూఢిల్లీ 110012.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.