తమిళనాడులోని కరైకుడిలోనున్న సీఎస్‌ఐఆర్ – సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన 19 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి కెమిస్ట్రీ/ ఫిజిక్స్ విభాగంలో ఎమ్మెస్సీ, బయోటెక్నాలజీ/ ఈఈఈ/ ఈసీఈ/ కెమికల్ ఇంజనీరింగ్/ కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్/ మెకానికిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, బీఎస్సీ, పీహెచ్‌డీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. అక్టోబర్ 18, 19, 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దరఖాస్తులు అధిక మొత్తంలో వస్తే రాత పరీక్ష నిర్వహించి, షార్ట్‌లిస్టింగ్ ద్వారా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.60,000ల వరకు స్టైపెండ్‌తో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లి్స్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
అడ్రస్: THE DECISION OF THE DIRECTOR, CSIR-CECRI REGARDING SELECTION WILL BE FINAL AND BINDING
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.