Cochin Shipyard Jobs 2023: కొచ్చిన్‌ షిప్‌యార్డులో డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎంపిక విధానం ఇదే..

|

Apr 10, 2023 | 8:35 PM

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో 76 డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీ (మెకానికల్) పోస్టులకు..

Cochin Shipyard Jobs 2023: కొచ్చిన్‌ షిప్‌యార్డులో డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎంపిక విధానం ఇదే..
Cochin Shipyard Limited
Follow us on

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో 76 డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీ (మెకానికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులకు కూడా 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసుయ ఏప్రిల్ 19, 2032వ తేదీ నాటికి 25 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా రూ.600 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్‌ సాధించినవారు రెండేళ్లపాటు కొనసాగే ట్రైనింగ్‌కు సెలక్ట్‌ అవుతారు. మొదటి ఏడాది ప్రతి నెల రూ.12,600లు, రెండో ఏడాది నెలకు రూ.13,800ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. అదనంగా పనిచేస్తే నెలకు రూ.4,450లు ఎక్స్‌ట్రాగా అందిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఎంపిక విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 50 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సబ్జెక్ట్‌ రిలేటెడ్‌ ప్రశ్నలు అడుగుతారు. అకడమిక్‌ మెరిట్‌ కింద 20 మార్కులు, ప్రాక్టికల్ టెస్టుకు 30 మార్కులు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.