AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Recruitment 2023: రాత పరీక్షలేకుండా కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా ఇంటర్వ్యూ..

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. 146 రిసెర్చ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, జూనియర్‌ ఇంజినీర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

UPSC Recruitment 2023: రాత పరీక్షలేకుండా కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా ఇంటర్వ్యూ..
UPSC
Srilakshmi C
|

Updated on: Apr 10, 2023 | 8:09 PM

Share

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. 146 రిసెర్చ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, జూనియర్‌ ఇంజినీర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఫొరెన్సిక్‌ ఆడిట్‌, రెగ్యులేషన్స్‌ ఇన్ఫర్మేషన్‌ తదితర విభాగాల్లో పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ఇంజినీరింగ్‌ డిగ్రీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 27, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.25 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు