CLAT 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ముగింపు తేదీ ఇదే..

|

Nov 13, 2022 | 10:15 AM

దేశవ్యాప్తంగా 'లా' యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది..

CLAT 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ముగింపు తేదీ ఇదే..
CLAT 2023
Follow us on

దేశవ్యాప్తంగా ‘లా’ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులతోపాటు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా క్లాట్‌ ప్రవేశ పరీక్ష (యూజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్ధులు/ ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎమ్‌ (పీజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో నవంబర్‌ 13, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌ఎల్‌యూ విద్యార్ధులకు సూచించింది. కాగా క్లాట్‌ 2023 ప్రవేశ పరీక్ష డిసెంబర్‌ 18, 2022వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. క్లాట్‌ 2023 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా 22 ప్రధాన లా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

దేశవ్యాప్తంగా 22 యూనివర్సిటీలు ఇవే..

ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో(ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ(ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (సిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హర్యాణా).

క్లాట్‌ దరఖాస్తు రుసుము ఇలా..

జనరల్ అభ్యర్థులు రూ. 4,000, ఎస్సీ/ఎస్టీ/బీపీఎల్‌ అభ్యర్థులు రూ. 3,500లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం..

క్లాట్‌-2023 ప్రవేశ పరీక్ష మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌, కరెంట్ ఆఫైర్స్, లీగల్‌ రీజనింగ్‌, లాజికల్ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.