CISF Recruitment 2023: పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ దళంలో 451 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Jan 24, 2023 | 9:18 PM

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌.. 451 కానిస్టేబుల్‌ (డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఫైర్‌ సర్వీస్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

CISF Recruitment 2023: పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ దళంలో 451 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
CISF Recruitment 2023
Follow us on

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌.. 451 కానిస్టేబుల్‌ (డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఫైర్‌ సర్వీస్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ విత్ గేర్‌ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం కూడా ఉండాలి. ఎత్తు 167 సెంటీ మీటర్లు, ఛాతీ కొలత 80 నుంచి 85 సెంటీ మీటర్లు ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఫిబ్రవరి 22, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు చెల్లించనవసరం లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఆధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు: 183
  • కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్‌ సర్వీస్‌) పోస్టులు: 268

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.