CIPET Recruitment 2023: సీ-పెట్‌లో సూపర్‌వైజరీ, నాన్‌ సూపర్‌వైజరీ ఉద్యోగాలు.. డిగ్రీ/డిప్లొమా అర్హత..

కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీ-పెట్) దేశవ్యాప్తంగా ఉన్న పలు సిపెట్‌ కేంద్రాల్లో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 38 సూపర్‌వైజరీ, నాన్‌ సూపర్‌వైజరీ..

CIPET Recruitment 2023: సీ-పెట్‌లో సూపర్‌వైజరీ, నాన్‌ సూపర్‌వైజరీ ఉద్యోగాలు.. డిగ్రీ/డిప్లొమా అర్హత..
CIPET
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 16, 2023 | 2:05 PM

కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీ-పెట్) దేశవ్యాప్తంగా ఉన్న పలు సిపెట్‌ కేంద్రాల్లో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 38 సూపర్‌వైజరీ, నాన్‌ సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో మే 29, 2023వ తేదీలోపు సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తును పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. రాత, నైపుణ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరీశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(స్కిల్ డెవలప్‌మెంట్/ ప్రాసెసింగ్/ టెస్టింగ్/ డిజైన్/ టూల్ రూమ్/ క్యాడ్‌ / క్యామ్‌) పోస్టులు: 10
  • అసిస్టెంట్ ఆఫీసర్ (ఎఫ్‌ & ఎ) పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (టూల్ రూమ్/ టెస్టింగ్/ ప్రాసెసింగ్/ డిజైన్ (క్యాడ్‌- క్యామ్‌-సీఏఈ)) పోస్టులు: 20
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులు: 3
  • అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులు: 4

అడ్రస్..

Director (Administration), CIPET Head Office, T.V.K. Industrial Estate, Guindy, Chennai– 600 032.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.