CUG Recruitment: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం..

| Edited By: Phani CH

Oct 31, 2021 | 7:40 AM

CUG Recruitment 2021: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గుజరాత్‌ (సీయూజీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ఈ క్యాంపస్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులను..

CUG Recruitment: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం..
Cug Jobs
Follow us on

CUG Recruitment 2021: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గుజరాత్‌ (సీయూజీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ఈ క్యాంపస్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఫైనాన్స్‌ ఆఫీసర్, లైబ్రేరియన్, సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, హిందీ టైపిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ టైపింగ్, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30–57ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు రూ.19,900 నుంచి రూ.1,44,200 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత

Rahul Gandhi: మోటర్ సైకిల్‌ టాక్సీపై రాహుల్.. గోవా ఎన్నికల ప్రచార పర్వానికి ముందు ఇలా..

Shyam Singha Roy: “శ్యామ్ సింగరాయ్” నుంచి అదిరిపోయే అప్డేట్.. రైజ్ ఆఫ్ శ్యామ్‌తో రానున్న నాని