Railway Jobs: ఇండియన్ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా సెంట్రల్ రైల్వేలో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్నిఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2422 అప్రెంటిస్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 17-01-2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పేమెంట్‌ను ఆన్‌లైన్ విధానంలో చేసుకోవచ్చు.
* దరఖాస్తుల స్వీకరణ జనవరి 17న ప్రారంభం కాగా, ఫిబ్రవరి 16తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* ముందుగా సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉండే అప్రెంటిస్ పోస్ట్ 2021-2022 లింక్‌పై క్లిక్ చేయాలి.
* చివరగా అవసరమైన వివరాలతో పాటు సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
Also Read: JIO, Airtel: జియో, ఎయిర్‌టెల్ 300 ప్లాన్.. ధర ఒకే విధంగా ఉన్నా ప్రయోజనాలు వేరు..?
Viral News: భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.!