CISF Recruitment: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్ పోస్టులు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా..

|

Dec 30, 2021 | 11:20 AM

CISF Recruitment: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా 2021 ఏడాదికిగాను హెడ్‌ కానిస్టేబుల్‌..

CISF Recruitment: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్ పోస్టులు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా..
Follow us on

CISF Recruitment: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా 2021 ఏడాదికిగాను హెడ్‌ కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను స్పోర్ట్స్‌ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ఏయో క్రీడలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 249 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌ బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్‌ వంటి క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వారు వీటికి అర్హులు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులవ్వాలి. రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్‌లో పాల్గొని ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* అభ్యర్థులను ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), డాక్యుమెంటేషన్, ట్రయల్‌ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Coronavirus: ఒమిక్రాన్‌, డెల్టా వేరియెంట్లు సునామీ సృష్టిస్తున్నాయి.. తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన..

IND vs SA: హిస్టరీ రిపీట్ చేసేందుకు దక్షిణాఫ్రికా.. చరిత్ర సృష్టించే పనిలో భారత్.. అసలు సెంచూరియన్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Soumya Swaminathan: ఓమిక్రాన్ కట్టడికి అదొక్కటే మార్గం.. కీలక ప్రకటన చేసిన WHO చీఫ్ సైంటిస్ట్!