AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UOH Recruitment: హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..

UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ వర్సిటీలో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు...

UOH Recruitment: హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..
Narender Vaitla
|

Updated on: Dec 30, 2021 | 12:07 PM

Share

UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ వర్సిటీలో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో (గురువారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? విద్యార్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రీసెర్చ్‌ అసోసియేట్‌ (03), డేటాఎంట్రీ ఆపరేటర్‌/సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* రీసెర్చ్‌ అసోసియేట్‌ లో భాగంగా ప్లాంట్‌ మాలిక్యులార్‌ బయాలజీ, మెటబాలమిక్స్,ప్రొటియోమిక్స్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతోపాటు నాలెడ్జ్‌ ఉండాలి.

* డేటాఎంట్రీ ఆపరేటర్‌/సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా దరఖాస్తును నింపి y.sreelakshmi@uohyd.ac.in మెయిల్‌ అడ్రస్‌కు పంపించాలి.

* రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 47,000 + 24శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

* డేటాఎంట్రీ ఆపరేటర్‌/సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,000+24శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 30-12-2021 చివరి తేదీ.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Nidhhi Agerwal: పవర్ స్టార్ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నా.. ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Nidhhi Agerwal: పవర్ స్టార్ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నా.. ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Follow Us
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు