CBSE 12th Exams: కరోనా మహమ్మారి దృష్ట్యా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక చాలా రోజుల పాటు డైలామా కొనసాగిన అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం జూన్ 1న ఈ ప్రకటన చేసింది. ఇక విద్యార్థులకు మార్కులను 10, 11వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం పాఠశాల ప్రిన్సిపాల్‌తో కూడిన ఓ కమిటీని వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే ఈ విధానం ద్వారా వచ్చిన మార్కులతో అంసతృప్తిగా ఉన్న విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం సుప్రీంకు తెలయజేసిన కేంద్రం.. తాజాగా ఆ దిశలో అడుగులు వేస్తోంది. కరోనా తగ్గుముఖం పడిన తర్వాత ఎవరైనా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతామని ముందుకొస్తే వారికి నిర్వహించేందుకు తాము సిద్ధమని తెలిపింది. తాజాగా ఈ విషయమై కీలక ప్రకటన చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖిర్యాల్. ఇంటర్నల్ మార్కులతో సంతృప్తి చెందని వారికోసం ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి సోమవారం అధికారికంగా తెలిపారు. అన్ని రకాల కరోనా నిబంధనలతో విద్యార్థులకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అయితే ఆగస్టులో ఏ తేదీల్లో నిర్వహిస్తామనమే విషయంలో మాత్రం మంత్రి స్పష్టతనివ్వలేదు.
Viral Video: మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!