JEE Mains 2021: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా కొన్ని పరీక్షలను రద్దు చేయగా, మరికొన్నింటినీ వాయిదా వేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇలా వాయిదా పడ్డ పరీక్షల్లో జేఈఈ మెయిన్స్ ఒకటి. మొత్తం 4 విడత్లో జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటి వరకు రెండు విడుతలు మాత్రమే జరిగాయి. మరో రెండు విడుతలు నిర్వహించేలోపే కరోనా విజృంభించింది దీంతో పరీక్షలను రద్దు చేశాయి. ఇక తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర సిద్ధమైంది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కేంద్ర మంత్రి ఆదేశాలకు అనుగుణంగా జేఈఈ 3,4 విడుతల జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. గత ఏప్రిల్ లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ మూడవ విడుత ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. 4వ విడుత ఈనెల 27 నుండి ఆగష్టు 2వ తేదీ వరకు జరుగుతాయి. కరోనా కారణంగా గత ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీషెడ్యూల్ చేసి ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో జేఈఈ పరీక్షలను నిబంధనలను పాటిస్తూ జరపనున్నారు. ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాలను 660 నుంచి 828కి పెంచింది. అలాగే పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 232 నుంచి 334కి పెంచారు. వీటితోపాటు..
* అభ్యర్థులు తమ సెంటర్ పట్టణాన్ని మార్చుకునే అవకాశం కలిపించారు.
* పరీక్షకు హాజరయ్యే వారికి సెంటర్ వద్ద మాస్కులను అందించనున్నారు.
* ఒకేసారి పెద్ద ఎత్తున అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి రాకుండా టైమ్ స్లాట్ విధానాన్ని తీసుకురానున్నారు.
* పరీక్షా కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.
Flipkart Announced: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగ అవకాశాలు.. ఏడాదికి రూ.26.57 లక్షల వేతనం..