Flipkart Announced: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగ అవకాశాలు.. ఏడాదికి రూ.26.57 లక్షల వేతనం..!

Flipkart Announced: ప్రైవేటు రంగాలలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాన్యువల్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ 'ఫ్లిప్‌కార్ట్ GRiD 3.0' నిర్వహిస్తోంది...

Flipkart Announced: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగ అవకాశాలు.. ఏడాదికి రూ.26.57 లక్షల వేతనం..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 06, 2021 | 1:56 PM

Flipkart Announced: ప్రైవేటు రంగాలలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాన్యువల్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ ‘ఫ్లిప్‌కార్ట్ GRiD 3.0’ నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్, బీఈ, ఎంటెక్ లాంటి కోర్సులు చదువుతున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఫుల్ టైమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం పొందేందుకు లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఇదో మంచి అవకాశమనే చెప్పాలి. 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఒకే ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఒక బృందంగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఎంపికైన వారికి ఏడాదికి రూ.26.57 లక్షల ప్యాకేజీ లభిస్తోంది. ఇక మూడో రౌండ్ వరకు వచ్చిన వారికి కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి.

Dare2Compete ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.2021 జూలై 8 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ హైరింగ్ ఛాలెంజ్ నాలుగు లెవెల్స్‌లో ఉంటుంది. మొదటి లెవెల్‌లో ఇ-కామర్స్ ట్రివియా, టెక్ స్కిల్స్ క్విజ్, రెండో లెవెల్‌లో ఐడియా ఆన్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ సబ్మిట్ చేయడం, మూడో లెవెల్‌లో కాన్సెప్ట్ డెమో వీడియో, కోడ్ సబ్మిషన్, చివరి రౌడ్‌లో సొల్యూషన్స్‌ని ఫ్లిప్‌కార్ట్ ప్యానెల్‌కు సమర్పించడం ఉంటుంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ GRiD 3.0 విజేతలకు రూ.1,50,000 విలువైన ఎలక్ట్రానిక్ గిఫ్ట్ వోచర్స్ లభిస్తాయి. మొదటి రన్నర్ అప్‌కు రూ.75,000 విలువైన ఎలక్ట్రానిక్ గిఫ్ట్ వోచర్స్ లభిస్తాయి. ఫైనలిస్టులందరికీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది. అభ్యర్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ లభిస్తాయి. జూలై 6న ఛాలెంజ్ మొదలవుతుంది. సెప్టెంబర్ 3న నేషనల్ ఫినాలే ఉంటుంది.

ఇవీ కూడా చదవండి

SBI Apprentice Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‏న్యూస్.. SBIలో 6100 ఉద్యోగాలు… డిగ్రీ పాసైతే చాలు… చివరి తేదీ ఎప్పుడంటే..

CBSE Exams: సరికొత్త విధానానికి తెర తీస్తోన్న సీబీఎస్‌ఈ.. ఒకే ఏడాదిలో రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలని.