CDFD Hyderabad Technical Associate Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (CDFD).. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ కోర్డినేటర్, కంప్యూటేషనల్ ల్యాబొరేటరీ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ (Technical Associate Posts) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానం తుది గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకోవాలని సీడీఎఫ్డీ సూచించింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ కోర్డినేటర్, కంప్యూటేషనల్ ల్యాబొరేటరీ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.78,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి డీఎంఎల్‌టీ, బీఎస్సీ/ డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ/ ఎండీ/ ఎంఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ లేదా గేట్‌లో అర్హత ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.