CDAC Recruitment: హైద‌రాబాద్ సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు.. కంప్యూట‌ర్ సైన్స్ చేసిన వారు అర్హులు..

|

Jun 20, 2021 | 6:18 AM

CDAC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది...

CDAC Recruitment: హైద‌రాబాద్ సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు.. కంప్యూట‌ర్ సైన్స్ చేసిన వారు అర్హులు..
Cdac Hyderabad
Follow us on

CDAC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ ఖాళీల‌ను హైద‌రాబాద్‌లోని ఈ సంస్థ‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 13 ప్రాజెక్ట్ ఇంజ‌నీర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ (కంప్యూట‌ర్ సైన్స్‌)/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 37 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌/ఇత‌ర టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రితేదీగా 26-06-2021ని నిర్ణ‌యించారు.
* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: IIT kharagpur Recruitment: ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

CBSE 10th Class result 2021: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఎప్పుడో తెలుసా..? మరింత క్లారిటీ ఇచ్చిన బోర్డు

NID Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హులెవ‌రు.? ఎలా అప్లై చేసుకోవాలి.