CCMB Recruitment: ఇంటర్‌ విద్యార్హత, ఇంగ్లిష్‌ టైపింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Apr 04, 2021 | 4:54 PM

CCMB Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్కులర్‌ బయాలీజీ (సీసీఎంబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనుంది...

CCMB Recruitment: ఇంటర్‌ విద్యార్హత, ఇంగ్లిష్‌ టైపింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలంటే..
Ccmb Jobs
Follow us on

CCMB Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్కులర్‌ బయాలీజీ (సీసీఎంబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులను ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

* ఈ నోటిఫికేషన్‌ ద్వారా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌) 4, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎఫ్‌ అండ్‌ ఏ) 1, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ పీ) 1 ఖాళీలను భర్తీచేయనున్నారు.
* మొత్తం పోస్టులు 6
* ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు ఇంటర్‌ లేదా దానికి తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.
* ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అప్పలికేషన్‌ ఫీజు రూ. 100
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 ఏళ్లు మించి ఉండరాదు. (ప్రభుత్వ నియమాల ప్రకారం వయసులో సడలింపులు ఉంటాయి.)
* దరఖాస్తులకు చివరి తేదీగా మే5గా ప్రకటించారు.
* పూర్తి వివరాలకు http://www.ccmb.res.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ఇలా అప్లై చేసుకోండి..

* ఆన్‌లైన్‌ దరఖాస్తు సోమవారం (05-04-2021) నుంచి ప్రారంభం కానుంది.
* http://www.ccmb.res.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం రిక్రూట్‌మెంట్ పేజీలోకి వెళ్లి నోటిఫికేషన్‌ ఓపెన్‌ చేయాలి.
* తర్వాత అవసరమైన వివరాలను ఎంటర్‌ చేసి, ఫీజు చెల్లించాలి.

Also Read: Indian Air Force Recruitment 2021: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

Kanya Utthan Yojana 2021: డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ. 50 వేలు స్కాలర్ షిప్..ఎలా అప్లై చేసుకోవాలంటే..!

పదో తరగతితో రైల్వే ఉద్యోగం.. ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ లేదు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. త్వరపడండి..