CBSE Class10 Supply Results 2023: సీబీఎస్‌ఈ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

|

Aug 04, 2023 | 9:46 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల-2023లకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం (ఆగస్టు 4) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని బోర్డు సూచించింది. విద్యార్థుల రోల్‌ నంబర్లు, స్కూల్‌ నంబర్లను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. కాగా సీబీఎస్సీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జులై 17 నుంచి 22 వరకు జరిగిన సంగతి తెలిసిదే. ఈ […]

CBSE Class10 Supply Results 2023: సీబీఎస్‌ఈ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
CBSE 10th Supply Results
Follow us on

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల-2023లకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం (ఆగస్టు 4) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని బోర్డు సూచించింది. విద్యార్థుల రోల్‌ నంబర్లు, స్కూల్‌ నంబర్లను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు.

కాగా సీబీఎస్సీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జులై 17 నుంచి 22 వరకు జరిగిన సంగతి తెలిసిదే. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 1,27,622 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 60,551 మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించిది. అంతే 47.40 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నమాట.

ఏపీ ఐటీఐల్లో 6,878 పోస్టులు ఖాళీ: కేంద్రం వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో దాదాపు 6,878 ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో 83 ప్రభుత్వ, 432 ప్రైవేటు ఐటీఐ కాలేజీలు ఉంన్నాయి. వీటిల్లో 8,077 పోస్టులు మంజూరు చేయగా, వాటిల్లో ప్రస్తుతం 1,199 మంది మాత్రమే విధుల్లో ఉన్నట్లు వెల్లడించింది. దాదాపు 6,878 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ్యలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఈ మేరకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఐఐటీలో ఇదే విధంగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఆయా పోస్టుల భర్తీకి డైరెక్టర్‌ జనరల్‌ ట్రైనింగ్‌ (డీజీటీ)తో రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని సూచించింది. కలిసి పనిచేస్తూ సమారస్యంగా సమస్య నివారణకు పరిష్కరణ చేపట్టాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

2019-20 లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు 1.77 లక్షల మంది ఉన్నట్లు వెల్లడించింది. 2018-19 నుంచి 2022-23 వరకు 3,632 మంది చేనేత కార్మికులకు నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద ఏపీలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చినట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం తెల్పింది. వీరిలో 2018-19 సంవత్సరంలో దాదాపు 2,340 మందికి శిక్షణ ఇచ్చారు. 2019-20 సంవత్సరంలో 120 మందికి, 2020-21 సంవత్సరంలో 60 మందికి, 2021-22 సంవత్సరంలో 746 మందికి, 2022-23 సంవత్సరంలో 366 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది.

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక యూనివర్సిటీ (ఇగ్నో) 2023 ప్రవేశాలకు గడువు పొడిగింపు

2023-24 అకడమిక్‌ విద్యా సంవత్సరానికిగాను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక యూనివర్సిటీ ప్రవేశాల గడువును ఆగ‌స్టు 10వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. లేదంటే 9492451812, 040- 23117550 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.