సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పది, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల-2023 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెల్పింది. కాగా జులై 17 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పదో తరగతి పరీక్షలు జులై 17 నుంచి 22 వరకు జరగనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఒకే రోజున అంటే జూలై 17వ తేదీన మాత్రమే నిర్వహిస్తారు. సమయాలు అన్ని రోజులలో పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది.
రెగ్యులర్ విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత స్కూల్ నుంచి తీసుకోవాలని సూచించింది. ప్రైవేటు అభ్యర్థులు మాత్రం వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత వివరాలు నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు తెలియజేస్తూ సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సన్యం భరద్వాజ్ వెల్లడించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.