
న్యూఢిల్లీ, మే 3: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలపై కీలక అప్‌డేట్ జారీ చేసింది. 10, 12 తరగతుల ఫలితాల వెల్లడి మే 20 తర్వాతే అని స్పస్టం చేసింది. ఈ మేరకు పరీక్షల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని సీబీఎస్‌ఈ తెలిపింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి – ఏప్రిల్ మధ్య వరకు సీబీఎస్సీ నిర్వహించిన 10వ, 12వ తరగతుల పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగాయి. ఇక 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. పరీక్షలు జరిగి రెండు నెలల గడుస్తున్న ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంతో ఎప్పుడెప్పుడా అని లక్షలాది విద్యార్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు సామాజిక మాధ్యమాల్లో రిజల్ట్స్‌కు సంబంధించి ఫేక్ సమాచారం చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ ఫేక్ వార్తలను ఖండించిన సీబీఎస్‌ఈ, మే 20 తర్వాతే ఫలితాలు విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గతేడాది మే 12వ తేదీన సీబీఎస్సీ బోర్డు పరీక్షల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫలితాల ప్రకటన అనంతరం సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. ఈ మేరకు 10, 12వ తరగతుల ఫలితాల తేదీకి సంబంధించి తాజా అప్‌డేట్‌ను సీబీఎస్సీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ షేర్ చేసింది.
విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.