CBSE 10th Students: ఈ ఏడాది సీబీఎస్‌ఈ టెన్త్‌ విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలే..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

|

Sep 15, 2024 | 6:49 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు ఈ ఏడాది రాష్ట్ర సిలబస్‌ ప్రకారంగానే పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సీబీఎస్సీ నుంచి ఎస్సెస్సీ బోర్డుకు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస అవగాహన లేకుండా ఏపీలో ఒకేసారి వెయ్యి స్కూళ్ల లో గత ప్రభుత్వం సీబీఎస్సీ పరీక్షా విధానం..

CBSE 10th Students: ఈ ఏడాది సీబీఎస్‌ఈ టెన్త్‌ విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలే..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
CBSE 10th Students
Follow us on

అమరావతి, సెప్టెంబర్‌ 15: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు ఈ ఏడాది రాష్ట్ర సిలబస్‌ ప్రకారంగానే పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సీబీఎస్సీ నుంచి ఎస్సెస్సీ బోర్డుకు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస అవగాహన లేకుండా ఏపీలో ఒకేసారి వెయ్యి స్కూళ్ల లో గత ప్రభుత్వం సీబీఎస్సీ పరీక్షా విధానం ప్రవేశపెట్టిందని కూటమి సర్కార్‌ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ బడుల్లోని విద్యార్థులు ఆ బోర్డు పరీక్షలకు సన్నద్ధంగా లేరని, విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులకు సరైన శిక్షణ కూడా లేదని ప్రభుత్వం పేర్కొంది. సీబీఎస్‌ఈకి అనుగుణంగా సామర్థ్యాలు కలిగి లేనందున తుది పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలో గుర్తించింది.

కాగా సీబీఎస్‌ఈ బోధన దశల వారీగా ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది వెయ్యి స్కూళ్లలో విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయా స్కూళ్లలో సీబీఎస్సీ సిలబస్‌ ప్రకారం బోధించేందుకు టీచర్లు కూడా లేకుండానే గత ప్రభుత్వం హడావిడిగా నిర్ణయాలు తీసుకుని ప్రవేశ పెట్టిందని టీడీపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్‌లో అధిక మంది వెనుక బడి ఉండటమే ఇందుకు కారణం. సీబీఎస్సీ పరీక్షా విధానంలో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్లో 90 శాతం విద్యార్థులు ఫెయిల్ అయినట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్టేట్ బోర్డు విధానంలో పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి 6వ తరగతి నుండే దశల వారీగా విద్యార్థుల సామర్థ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

వెబ్‌సైట్లో ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్‌ ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS) నిర్వహించిన రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(RRB)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆఫీసర్‌ స్కేల్‌-1 ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలను నమోదు చేసి, ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రిలిమ్స్‌ అర్హత సాధించిన వారికి త్వరలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన పరీక్ష తేదీలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెయిన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌ స్కేల్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.