CAT 2024 Top Rankers: ‘క్యాట్‌’లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా ముగ్గురికి 100 పర్సంటైల్‌ స్కోర్‌!

|

Dec 22, 2024 | 4:32 PM

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో ప్రవేశాలకు నిర్వహించిన క్యాట్ 2024 పలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణకు చెందని ముగ్గురు విద్యార్ధులు ఏకంగా వంద శాతం స్కోర్ సాధించారు. ఈ మేరకు ఐఐఎం కోల్‌కతా వెల్లడించింది..

CAT 2024 Top Rankers: ‘క్యాట్‌’లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా ముగ్గురికి 100 పర్సంటైల్‌ స్కోర్‌!
CAT 2024 Toppers
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించేందుకు నిర్వహించిన ‘కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (క్యాట్‌)- 2024 ఫలితాలు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందని పలువురు విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా ముగ్గురు విద్యార్ధులు 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు. దేశ వ్యాప్తంగా 14 మంది 100 పర్సంటైల్‌ స్కోర్‌ చేయగా.. అందులో ఇద్దరు తెలంగాణ నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఐదుగురు మహారాష్ట్రకు చెందిన విద్యార్థులున్నారు. మొత్తం 14 మందిలో ఓ అమ్మాయి కూడా ఉన్నారు. ఇక దేశంలో మొత్తం 29 మంది 99.99 పర్సంటైల్‌ సాధించారు. ఒకరు 99.98 పర్సంటైల్‌ పొందారు. ఈ 30 మందిలో ముగ్గురు తెలంగాణ విద్యార్థు ఉన్నారు. ఈ మేరకు పరీక్ష నిర్వహించిన ఐఐఎం కోల్‌కతా ర్యాంకర్ల వివరాలను వెల్లడించింది.

ప్రస్తుతానికి ఐఐఎం కోల్‌కతా టాపర్ల పేర్లను విడుదల చేయలేదు. దీంతో వారి వివరాలు తెలియరాలేదు. 100 పర్సంటైల్‌ పొందిన 14 మందిలో 13 మంది, 99.99 పర్సంటైల్‌ సాధించిన 29 మందిలో 28 మంది, 99.98 పర్సంటైల్‌ పొందిన 30 మందిలో 22 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులే కావడం మరో విశేషం.

క్యాట్ 2024 స్కోర్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా నవంబరు 24వ తేదీన క్యాట్‌ పరీక్ష నిర్వహించగా.. దేశ వ్యాప్తంగా సుమారు 2.93 లక్షల మంది విద్యార్ధులు పరీక్ష రాశారు. ఇందులో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఐఐఎంలు ఇంటర్వ్యూ నిర్వహించి సీట్లు కేటాయిస్తాయి. క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 21 ఐఐఎంలలో సీట్లు కేటాయిస్తారు. ఇవే కాకుండా మరో 86 ఇతర సంస్థలు కూడా ఈ ర్యాంకు ఆధారంగా సీట్లను భర్తీ చేస్తాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.