Top Skill Courses after Class 10th: పదో తరగతి తర్వాత ఈ నైపుణ్య కోర్సులు చేశారంటే.. ఉజ్వల భవిష్యత్తు మీదే!

|

Jul 02, 2024 | 5:47 PM

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎస్సెస్సీ బోర్డు పరీక్షలతోపాటు సీబీఎస్సీ పదో తరగతి బోర్డ్ పరీక్షల 2024 ఫలితాలు వెలువడ్డాయి. బోర్డు పరీక్షల తర్వాత విద్యార్ధుల్లో తలెత్తే ముఖ్యమైన ప్రశ్న.. తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి. కళ్ల ముందు ఎన్నో ఆప్షన్లు ఉన్నా.. వాటిల్లో ఏ కోర్సు తీసుకోవాలి అనే దానిపై ప్రతి ఒక్కరూ కన్ఫూజ్‌ అవుతుంటారు. తెలివైన నిర్ణయం తీసుకోకుంటే లైఫ్‌లో సరిదిద్దుకోలేని తప్పు చేసినట్లవుతుంది. కెరీర్‌లో ఉన్నత శిఖరాలు..

Top Skill Courses after Class 10th: పదో తరగతి తర్వాత ఈ నైపుణ్య కోర్సులు చేశారంటే.. ఉజ్వల భవిష్యత్తు మీదే!
Top Skill Courses After Class 10th
Follow us on

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎస్సెస్సీ బోర్డు పరీక్షలతోపాటు సీబీఎస్సీ పదో తరగతి బోర్డ్ పరీక్షల 2024 ఫలితాలు వెలువడ్డాయి. బోర్డు పరీక్షల తర్వాత విద్యార్ధుల్లో తలెత్తే ముఖ్యమైన ప్రశ్న.. తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి. కళ్ల ముందు ఎన్నో ఆప్షన్లు ఉన్నా.. వాటిల్లో ఏ కోర్సు తీసుకోవాలి అనే దానిపై ప్రతి ఒక్కరూ కన్ఫూజ్‌ అవుతుంటారు. తెలివైన నిర్ణయం తీసుకోకుంటే లైఫ్‌లో సరిదిద్దుకోలేని తప్పు చేసినట్లవుతుంది. కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే సరైన నైపుణ్యాలు ఉన్న కోర్సును ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో పదో తరగత తర్వాత నైపుణ్యం పెంచుకోవడానికి ఉపయోగపడే టాప్‌ కోర్సుల వివరాలు ఇవే. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వెబ్ డెవలప్‌మెంట్ కోర్సులు

నేటి కాలంలో ఇంటర్నెట్ మన జీవితంలో అంతర్భాగమై పోయింది. నైపుణ్యం కలిగిన వెబ్ డెవలపర్‌లకు అధిక డిమాండ్ ఉంది. వెబ్ డెవలప్‌మెంట్ కోర్సు చేస్తే.. వెబ్‌సైట్‌లను రూపొందించడానికి అవసరమైన స్కిల్స్ అందుతాయి. ఈ కోర్సు ద్వారా HTML, జావా వంటి విభిన్న కోడింగ్ భాషలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఫారిన్ లాంగ్వేజ్ కోర్సు

ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ వంటి ఫారెన్‌ భాష నేర్చుకోవడం కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడమే కాకుండా నేటి ప్రపంచీకరణ యుగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. విదేశీ భాష నేర్చుకోవడం వల్ల అభిజ్ఞా సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. విదేశాలలో చదువులు, ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది సరైన కోర్సు.

ఇవి కూడా చదవండి

ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్

నేటి కాలంలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో స్కిల్స్‌ అత్యంత విలువైన ఆస్తిగా పరిగణించొచ్చు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, AI- పవర్డ్ అప్లికేషన్‌లను రూపొందించడం, మొబైల్ అప్లికేషన్‌ల రూపకల్పన వంటి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. విద్యార్థులు ఈ ప్రోగ్రామింగ్‌లలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే ఇతర విద్యార్థుల కంటే పోటీలో కాస్త ముందు ఉంటారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో ముందంజలో ఉండాలంటే ఇలాంటి కోర్సులు తప్పనిసరిగా నేర్చుకోవాలి.

ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోర్సులు

సోషల్ మీడియాలలో డిజిటల్ కంటెంట్ క్రియేషన్‌పై నేటి కాలంలో విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. బ్లాగ్‌లు, వ్లాగ్‌లు, ల్యాండ్‌స్కేప్‌లను క్యాప్చర్ చేయడం వంటి ఎన్నో విషయాలపై డిజిటల్ కంటెంట్‌ను సృష్టించాలంటే సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.

క్యులీనరీ ఆర్ట్స్ కోర్సు

ఆహారంతో ప్రయోగాలు చేయడం, క్రియేటివ్‌గా కొత్త వంటకాలను సృష్టించడం పట్ల మక్కువ ఉన్న విద్యార్థులకు, పాక కళలపై కోర్సు చేయవచ్చు. పాక పద్ధతుల్లో నైపుణ్యం సాధించడం నుంచి వంటగది నిర్వహణ వరకు ఈ కోర్సులు సంబంధిత నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందిస్తాయి. హోటల్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్‌ను నిర్మించాలనుకునే వారికి ఈ కోర్సు సరైనది.

ఫైనాన్షియల్‌ లిటరసీ సర్టిఫికేషన్‌

నేటి కాలంలో మనీ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైన నైపుణ్యం. విద్యార్థులు చిన్న వయస్సులోనే ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలను నేర్చుకోవడం అత్యవసరం. ఈ కోర్సు బడ్జెట్, పొదుపు, నిర్వహణ ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాలపై అంతర్దృష్టిని అందిస్తుంది. విద్యార్థులు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా ఈ కోర్సు ప్రేరేపిస్తుంది. ఫైనాన్స్‌లో వృత్తిని ఎంచుకునే వారికి సహాయపడుతుంది.

పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్‌ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్

ప్రస్తుతం రోజుల్లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కీలక నైపుణ్యం. ఈ కోర్సు విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వివిధ వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలకు సహాయపడే విభిన్నమైన రచన, మాట్లాడే నైపుణ్యాలు, వృత్తిపరమైన, సమర్థవంతమైన సంభాషణలను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.

ఈ కోర్సుల్లో ఏ కోర్సును ఎంపిక చేసుకున్నా 10వ తరగతి బోర్డు పరీక్ష తర్వాత అంతులేని అవకాశాలను అందిస్తుంది. మీ అభిరుచికి తగ్గట్లు, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.