బెంగళూరులోని కెనరా బ్యాంక్‌లోని హ్యూమన్ రిసోర్సెస్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న పలు కెనరా బ్యాంకు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 60 పోస్టులను (ఐటీ) ఏపీఐ మేనేజ్‌మెంట్, (ఐటీ) డేటాబెస్/ పీఎల్ ఎస్‌క్యూఎల్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ పోస్టులకు దరకాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ/బీటెక్, బీసీఏ/ఎంసీఏ/ ఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారుమ జనవరి 24, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 18 లక్షల నుంచి రూ. 27 లక్షల ప్యాకేజీ అందజేస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.